అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Head Constable | ఆకస్మికంగా మృతిచెందిన రెంజల్(Renjal) పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ తలారి తిరుపతి కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. బుధవారం కానిస్టేబుల్ అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు.
Head Constable | ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ..
రెంజల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తలారి తిరుపతి విధుల్లో భాగంగా ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో ఉన్నాడు. అయితే ఆయనకు మంగళవారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. బుధవారం ఆయన అంత్యక్రియలు ఆర్మూర్‌లో నిర్వహించగా సీపీ సాయిచైతన్య హాజరయ్యారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. విషాద సమయంలో కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తలారి తిరుపతి మృతి పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రెంజల్ ఎస్సై గంగాధర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకిల్ పాషా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.