CM Revanth Reddy | ఇండియాకు వస్తున్నా.. ఆ అంశాలపై మాట్లాడతా..: సీఎం రేవంత్​రెడ్డి

రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth Reddy | రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (MEA) అనుమతి నిరాకరించిందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం బోస్టన్‌కు వెళ్లకుండా.. కొన్ని గంటల్లోనే నేను తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతున్నానని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్​’లో ఆయన పోస్ట్​ పెట్టారు.

CM Revanth Reddy | నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో నాకు మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ‘జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయంలో నాకు అండగా నిలిచిన నా పార్టీకి, నాయకులకు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నేను ఎంతో కృతజ్ఞుడను. లండన్‌లో నా సమావేశాలు మరియు నిర్ణీత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. మూడు రోజులుగా నాకు లభించిన అద్భుతమైన మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’ అని రాసుకొచ్చారు.

CM Revanth Reddy | అన్ని విషయాల గురించి మాట్లాడతా..

‘నా అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నాను. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఈ అంశాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడతాను.’ అని రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి..: Autos Bandh | ఆటోల బంద్​.. మంత్రి పొన్నం కీలక ప్రకటన..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *