Arvind Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రాష్ట్ర శాంతిభద్రతలకే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పుగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Arvind Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రాష్ట్ర శాంతిభద్రతలకే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పుగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. మంగళవారం ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన ఆయన, సీఎం రేవంత్ విదేశీ పర్యటనలు , పరిపాలనా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Arvind Revanth Reddy | అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ..

విదేశాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు దేశ వ్యతిరేక శక్తులు మాత్రమే ఉన్నాయా అని అర్వింద్ ప్రశ్నించారు. విదేశీ పర్యటనల్లో దేశంపై విషం చిమ్మే వారితో ఆయన చేతులు కలుపుతున్నారని, ఇక్కడ చిచ్చు రగిలించి రాజకీయ లబ్ధి పొందడమే ఆయన లక్ష్యమని ధ్వజమెత్తారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేసిన అర్వింద్.. ఇకపై రేవంత్ ప్రతి కదలిక జాతీయ భద్రతా సంస్థల (National Security Agencies) నిఘా నీడలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

arvin

Arvind Revanth Reddy | విద్యారంగాన్ని గాలికి వదిలేశారు..

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని అర్వింద్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన బకాయిలను క్లియర్ చేస్తామని రాహుల్ గాంధీతో హామీ ఇప్పించి, అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలను గాలికొదిలేసి, విదేశాల నుంచి వేరే సంస్థలను ఎందుకు తీసుకువస్తారని నిలదీశారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాదని తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన విమర్శించారు.

ఇది కూడా చదవండి:  Indian Students US | అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల దరఖాస్తులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *