Komatireddy Rajagopal Reddy | భట్టి విక్రమార్కతో భేటీపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తన భేటీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టతనిచ్చారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Komatireddy Rajagopal Reddy | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తన భేటీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎంతో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి, నిధుల సాధన కోసమే భట్టిని కలిశానని తెలిపారు. తనపై వచ్చే విమర్శలు, తనను విమర్శించే వారి స్థాయి గురించి తాను మాట్లాడదలుచుకోలేదని, ఎందుకు విమర్శిస్తున్నారో వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేశానని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా సర్వస్వం ధారపోసి కొట్లాడిన వ్యక్తిని తాననని, 2018 ఎన్నికల్లో పెద్ద పెద్ద లీడర్లు ఓడిపోయినా మునుగోడు ప్రజలు తనను గెలిపించారన్నారు. తాను ఎప్పుడూ తెలంగాణ ప్రజల అభివృద్ధి, అవినీతికి వ్యతిరేకంగానే పని చేస్తానని స్పష్టం చేశారు.

Komatireddy Rajagopal Reddy | పార్టీ బలోపేతమే నా లక్ష్యం..

తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, సీఎంను గానీ ఇతర నాయకులను వ్యక్తిగతంగా విమర్శించలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడం వల్ల, గెలిచిన తర్వాత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరుగుతోందని చెప్పానని, అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై, అధిష్టానంపై ఉందని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తాను ఏ మాట్లాడినా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతోనే మాట్లాడతానని, పార్టీని బలహీనపరిచేలా ఎప్పుడూ వ్యహరించబోనని చెప్పారు. తెలంగాణలో ఎంతో మంది నిజాయితీపరులైన ఉద్యమకారులు ఉన్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఉద్యమకారులను కించపరిచేలా కథనాలు రాయవద్దని హెచ్చరించారు. మాది అసలైన కాంగ్రెస్ రక్తం అని పేర్కొన్నారు.

Komatireddy Rajagopal Reddy | అధిష్టానమే ఫైనల్..

కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. ఈ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కూడా చెప్పారని, ఈ అంశంలో సీఎం మాటే తన మాట అని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉందని, కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై లోతైన అధ్యయనం చేసి పీసీసీకి నివేదిక ఇచ్చిందని తెలిపారు. అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Nagarjuna Sagar | నాగార్జున సాగర్​ నీటి విడుదల.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *