22A Agricultural Lands | 22ఏ నుంచి వ్యవసాయ భూములు తొలగించాలి : హరీశ్​రావు

వ్యవసాయ భూములను సైతం నిషేధిత జాబితాలో పెట్టారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: 22A Agricultural Lands | రైతు భూములు కూడా 22A నిషేధిత జాబితాలో పెట్టారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం రామదాస్‌పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22Aలో చేర్చి, రిజిస్ట్రేషన్లు నిలిపివేశారన్నారు. వ్యవసాయ భూములతో పాటు, ఇతర మూడు లేఅవుట్లలోని భూములు, బాండెడ్ లేబర్‌కు కేటాయించిన భూములు కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చారన్నారు.

నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులకు రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు రావడం లేదని హరీశ్​రావు (Harish Rao) అన్నారు. చివరకు యూరియా కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఈ భూములు రైతులవేనని రిపోర్ట్ ఇచ్చారని, అయినా 22A నుంచి ఎందుకు తొలగించడం లేదని ఆయన ప్రశ్నించారు. 30 శాతం కమీషన్ల కోసం రైతుల భూములపై కన్నేశారని ఆయన ఆరోపించారు.

22A Agricultural Lands | రైతులకు న్యాయం చేయాలి

98 శాతం దరఖాస్తులు క్లియర్ చేశామని పొంగులేటి చెబుతున్నారని, అవన్నీ ఉత్త మాటలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్ఒకన్నారు. అధికారులు సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం భూములను 22A నుంచి తొలగించడం లేదన్నారు. వెంటనే రైతుల భూములను 22A నుంచి తొలగించి, వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: ACB Raids | భూగర్భ గనుల శాఖ ఏడీ ఇళ్లలో ఏసీబీ దాడులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *