MIM MLC Suspended | ఎమ్మెల్సీని పార్టీ నుంచి బహిష్కరించిన ఎంఐఎం

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MIM MLC Suspended | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఒవైసీ (Asaduddin Owaisi) ఆదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అత్తాపూర్​లో బాలికపై అనుచితంగా ప్రవర్తిస్తుండగా పలువురు యువకులు ఆయనను పట్టుకొని కొట్టారు. ఈ మేరకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి. అయితే అవి డీప్​ ఫేక్​ వీడియోలు అని ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పార్టీ మాత్రం ఆయనపై చర్యలు తీసుకుంది.

MIM MLC Suspended | రాజీనామా చేయాలి

ఆరోపణల నేపథ్యంలో ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ బేగ్​ను సస్పెండ్ చేశారు. అంతేగాకుంఆ ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్‌కు లేఖ సమర్పించాలని అసదుద్దీన్ ఆదేశించారు. స్థానిక సంస్థల కోటా నుంచి బేగ్ 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవికాలం 2029 మే వరకు ఉంది. ఈ ఉదంతం అధిష్టానానికి ముందే తెలిసినా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని పలువురు ఆరోపించారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ఇప్పుడు చర్యలు తీసుకున్నారని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Hyderabad MMTS AC Coaches | ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో లోకల్‌ రైళ్లలో ఏసీ ప్రయాణం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *