Danam Nagender comments | అధికారులను కొట్టడం నాకు అలవాటే.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులను కొట్టడం తనకు అలవాటే అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Danam Nagender comments | ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులను కొట్టడం తనకు అలవాటే అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని దానం నాగేందర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం అధికారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తాను రాకముందే డ్రా తీయడంపై దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై ఆయన మాట్లాడారు. మంత్రిని, ఎమ్మెల్యేలను అధికారులు లెక్క చేయడం లేదని మండిపడ్డారు.

Danam Nagender comments | దాడి చేయడానికి రెడీ

తన నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఇతరులను ఎంపిక చేశారని దానం ఆరోపించారు. ఖైరతాబాద్‌కు కేటాయించాల్సిన 480 ఇళ్లకుగాను 120 ఇళ్లే ఇచ్చి నియోజకవర్గానికి సంబంధంలేని వారికి కట్టబెట్టారన్నారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓల్డ్​ సిటీ ఎమ్మెల్యేలు అధికారులను ఇష్టం వచ్చినట్లు తిట్టారని దానం అన్నారు. వారిలాగా చేయడానికి తాను సిద్ధం అన్నారు. గతంలో తాను ఓ అధికారిని కొట్టి జైలుకు వెళ్లానని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు జైలుకు అని మంచిగా ఉంటున్నానని పేర్కొన్నారు.

సీఎంకు ఫిర్యాదు చేస్తా

ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో అవకతవకలు జరిగాయని దానం నాగేందర్ ఆరోపించారు. హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లలో 360 ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారుల వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు.

ఇది కూడా చదవండి..: Army Regiment Theft | ఆర్మీ రెజిమెంట్​లో చోరీ.. ఏకే 47 సహా 12 ఆయుధాలు మిస్సింగ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *