Symbiotec Pharma IPO | ఫ్లాట్‌గా లిస్టయినా.. పైకి ఎగబాకిన ఫార్మా కంపెనీ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఫార్మా ల్యాబ్ కంపెనీ షేర్లు లిస్టయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Symbiotec Pharma IPO | సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ కంపెనీ రూ. 1,757 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. తాజా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్ల వాటాల విక్రయం ద్వారా రూ. 1,607 కోట్లు సమీకరించింది.

Symbiotec Pharma IPO | సబ్‌స్క్రిప్షన్‌కు మంచి డిమాండ్..

సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ కంపెనీ ఐపీవో (IPO) ఆగస్టు 24 న ప్రారంభమైంది. ఆగస్టు 27 వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు. కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌క” ఇన్వెస్టర్లనుంచి మంచి డిమాండ్ కనిపించింది. మొత్తం కోటా 75.08 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 181.20 రెట్లు, ఎన్ ఐఐ కోటా 77.56 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 13.69 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Symbiotec Pharma IPO | లిస్టింగ్ తర్వాత కోలుకున్న షేర్లు..

సింబయోటెక్ ఫార్మా ల్యాబ్ కంపెనీ షేర్లకు మంగళవారం ఉదయం జీఎంపీ 18.72 శాతం ఉంది. అయితే కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో నిరాశ పరిచాయి. కంపెనీ ఒక్కో షేరును రూ. 988కి విక్రయించగా.. అదే ధర వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అక్కడినుంచి మరో 5.5 శాతం పడిపోయి రూ. 934 వద్ద కనిష్టాన్ని నమోదు చేసి ఐపీవో ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. అయితే కనిష్టాలవద్దనుంచి కోలుకుని షేర్లు పైకి ఎగబాకాయి. నష్టాలను భర్తీ చేసుకుని లాభాల బాట పట్టాయి. ఇంట్రాడేలో సుమారు 17 శాతానికిపైగా పెరిగి రూ. 1,180 వద్ద గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో 16.30 శాతం లాభంతో రూ. 1,149 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Skyways Air IPO | లాజిస్టిక్ కంపెనీ ఐపీవోలు ఫ్లాప్.. 10 శాతం నష్టాలలో లిస్టయిన స్కైవేస్ ఏయిర్ కంపెనీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *