22A Land Issue | కాంగ్రెస్ మెడలు వంచే వరకు పోరాటం : అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

రైతులు, అమాయకుల భూములను రాష్ట్ర ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ మండిపడ్డారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రంలోని రైతులు, అమాయకుల భూములను రాష్ట్ర ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్​లోని(Hyderabad) ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షకు ఇందూరు నుంచి భారీగా తరలివెళ్లారు.

22A Land Issue | అమాయక ప్రజలతో ఆటలా..?

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ మెడలు వంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అమాయక ప్రజల భూములతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని 22 ఏ చట్టం చెబితే.. ఈ ప్రభుత్వం మాత్రం రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతకుముందు దీక్షకు వెళ్లే వాహనాలకు ఇందలవాయి టోల్గేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: “’అక్షరటుడే’ను ఫాలో అవ్వండి..”

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *