అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sunnam Cheruvu | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చెరువులకు హైడ్రా (HYDRAA) పూర్వ వైభవం తెస్తోంది. మురికి కూపాలుగా మారిన తటాకాలను పునరుద్ధరించి.. ఆహ్లాదకరంగా మారుస్తోంది. ఇప్పటికే బతుకమ్మ కుంట, నల్ల చెరువులను అభివృద్ధి చేసింది.
హైడ్రా ప్రస్తుతం మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువులను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తమ్మిడికుంటలో పేరుకుపోయిన బయో వ్యర్థాలను తొలగించామన్నారు. సున్నం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు. తమ్మిడికుంటలో మురుగునీటిని తొలగించామన్నారు. మెటల్ చార్మినార్వైపు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరే చేసే యూనిట్లు తొలగించాలని ఆదేశించారు.
Sunnam Cheruvu | వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలి
సున్నం చెరువుకు ఆనుకుని ఉన్న బండపైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేయాలని రంగనాథ్ సూచించారు. చెరువు చుట్టూ పచ్చదనం పెంచాలని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడాలన్నారు. అంతుకు ముందు కృష్ణాకాంత్ను ఆయన పరిశీలించారు. కృష్ణాకాంత్ పార్కు చెరువు లోతుతో పాటు విస్తీర్ణం పెరిగితే వరదను చాలవరకు కట్టడి చేయవచ్చునని తెలిపారు.
✳️ HYDRAA Commissioner Sri A.V. Ranganath Garu inspected the ongoing works at Thammidikunta Lake and assessed the progress of the development activities.#HYDRAA #Thammidikunta #LakeDevelopment #LakeRejuvenation pic.twitter.com/9WHeA8gPbU
— HYDRAA (@Comm_HYDRAA) September 6, 2026
దీనిని కూడా చదవండి : Kavitha DGP Remarks | డీజీపీ రికమండేషన్‌తో ఉద్యోగంలో చేరారా.. కవిత సంచలన వ్యాఖ్యలు