అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Arrest | మేడ్చల్ జిల్లా (Medchal District) హకీంపేట దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రవల్లి వెళ్తున్న కేటీఆర్, హరీష్‌రావును పోలీసులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు అక్కడికి బయలు దేరారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి వెళ్తున్న ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఓ పోలీస్ అధికారి ఎమ్మెల్యేను ఉద్దేశించి ఎవడ్ర నువ్వు అన్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
KTR Arrest | మేమే కాపాడుకుంటాం
కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి గూండాలతో కేసీఆర్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి కాంగ్రెస్ గూండాలను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి మీదకి దాడి చేయడానికి కాంగ్రెస్ గూండాలను తీసుకెళ్లమని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. పోలీసుల మీద తమకు నమ్మకం లేదని, తమ నాయకుడిని తామే కాపాడుకుంటామన్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని వాగ్వాదం చేశారు.
KTR Arrest | బోయిన్పల్లి ఠాణాకు తరలింపు
హకీంపేట వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్‌రావును జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు, మిగతా వారిని బోయిన్పల్లి ఠాణాకు తరలించారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Speaker Meeting | స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం