అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎదుట జరిగిన గొడవలో డీప్ ఫేక్ వీడియోలు సర్క్యూలేట్ చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఉదయంం ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించంచారు. సభలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్ (Cybercrime)లో ఫిర్యాదు చేస్తామన్నారు. నిన్న, మొన్నటి పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
KTR | బీఆర్ఎస్ నేతలపై మరో కేసు
బీఆర్ఎస్ నాయకులపై మరో కేసు నమోదు అయింది. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనపై కేటీఆర్, హరీశ్ రావు, నవీన్ రెడ్డి, సుధీర్ రెడ్డి సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. మహిళా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, టీ-షర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి..: TTD Governing Body Meeting | రేపు తిరుమలలో TTD పాలకమండలి సమావేశం