Rice Mills Strike | జిల్లాలో రైస్​మిల్లుల​ బంద్​.. కారణమేమిటంటే..?

ఉమ్మడి జిల్లాలో రైస్​మిల్లులు బంద్​ నిర్వహిస్తున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Rice Mills Strike | ఉమ్మడి జిల్లాలో రైస్​మిల్లులు బంద్​ నిర్వహిస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొన్నాళ్లుగా రైస్​మిల్లర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో డిమాండ్​ చేస్తూ వస్తున్నారు.

Rice Mills Strike | ఆ నిబంధన పాటించాలంటే ఎలా..

రైస్​మిల్లర్స్ అసోసియేషన్​ ప్రతినిధులు మాట్లాడుతూ.. 1969 నుంచి ఉన్న నిబంధన ప్రకారం క్వింటాల్​కు 67.1కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉందని.. కాని మారిన పరిస్థితుల కారణంగా దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన చట్టం ప్రకారం బియ్యం సరఫరా సాధ్యం కావట్లేదన్నారు. అలాగే రైతుల తెచ్చిన ధాన్యంలో 15శాతం నుంచి 20శాతం వరకు డ్యామేజీ భరించాల్సి వస్తోందన్నారు.

Rice Mills Strike | పెండింగ్​లో రూ.4వేల కోట్ల బిల్లులు

అలాగే 2014 నుంచి నిజామాబాద్​ జిల్లా (Nizamabad District)లోని అనేక రైస్​మిల్లులకు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. దీంతో మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్​కు ప్రభుత్వం అడుగుతున్న బియ్యం సరఫరా చేయడం కూడా సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయమపై అసోసియేషన్​ ప్రతినిధులతో చర్చించాలని కోరారు. లేనిపక్షంలో బంద్​కు కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: DCM Truck Accident | కారును తప్పించబోయి డీసీఎం బోల్తా.. జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *