ACB Raid | సీఎంఆర్​ఎఫ్​ చెక్కు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

సీఎంఆర్​ఎఫ్​ చెక్కు మంజూరు కోసం లంచం డిమాండ్​ చేసిన ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేస్తూ.. లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ప్రజల్లో సైతం అవగాహన రావడంతో ఇటీవల ఏసీబీ (ACB)కి ఫిర్యాదులు పెరిగాయి. తాజాగా రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.

హైదరాబాద్‌లోని సచివాలయంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆనందేషి రాఘవేందర్, టీఎస్​ఐడీసీ (TSIDC) కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్​ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకం కింద ఫిర్యాదిదారుడి వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడం, మంజూరైన రూ.2 లక్షల మొత్తానికి చెక్కు జారీ చేయడం, మిగిలిన వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడం కోసం ఇద్దరు లంచం డిమాండ్​ చేశారు.

ACB Raid | ఫోన్​ పే ద్వారా రూ.5 వేలు

నిందితులు గతంలోనే బాధితుడి నుంచి ఫోన్​ పే ద్వారా రూ.5 వేలు లంచం తీసుకున్నారు. మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీంతో అతడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేందర్​, బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్‌లోని TSIDC కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్​ను వల పన్ని పట్టుకున్నారు. ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy Countdown | రేవంత్​రెడ్డికి కౌంట్​డౌన్​ మొదలైంది : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.