Drunk Driving Cases | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తాం : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Drunk Driving Cases | రూ.కోటికి పైగా జరిమానాలు..

సీపీ (CP Sai Chaitanya) మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పీఎస్ పరిధుల్లో ఆరు వారాల్లో డ్రంకన్ డ్రైవ్​ కేసుల్లో 1,784 మంది పట్టుబడ్డారన్నారు. వారిని నిజామాబాద్​, బోధన్ అర్మూర్ కోర్టుల్లో హాజరుపర్చగా 124 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించామని తెలిపారు. మిగిలిన వారికి రూ. రూ.కోటికి పైగా  జరిమానా వేశామని చెప్పారు. ఈ నెల 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహించి, మొత్తం 1,784 కేసుల నమోదు చేశామన్నారు.

Drunk Driving Cases | కఠిన నిబంధనలు..

ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ పేర్కొన్నారు. వాహనాదారులు వాహనానికి సంబంధించిన పత్రాలు తప్పక తమ వెంట ఉంచుకోవాలన్నారు. డ్రంకన్ డ్రైవ్​లో పట్టుబడిన వారి లైసెన్స్ ఆర్నెళ్లపాటు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపి రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్స్​ లభించదన్నారు.మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్, వెహికల్ ఓనర్ పైన ఛార్జ్​షీట్ నమోదు చేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: 18 Hours Power Supply | వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి..: దినేష్​ కులాచారి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *