అక్షరటుడే, గాంధారి: Urea Demand Controversy | యూరియా అడిగిన రైతును పరుష పదజాలంతో దూషించాడు ఓ వ్యవసాయాధికారి. ఈ ఘటన గాంధారి(Gandhari) మండలంలో చోటు చేసుకుంది.
Urea Demand Controversy | యూరియా కోసం వేడుకోగా..
వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సోమరిపేట రవి ఆదివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో గాంధారి వ్యవసాయాధికారికి ఫోన్ చేశాడు. యూరియా రాక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. త్వరగా యూరియా ఇప్పించాలని కోరారు. ఈ విషయానికే ఆగ్రహావేశాలకు లోనైన సదరు వ్యవసాయాధికారి సదరు రైతును అనరాని మాటలు తిట్టాడు. పరుష పదజాలంతో దూషించడంతో సదరు రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనిపై రైతు సంఘాల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తామని వారు ఘాటుగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఖైరతాబాద్ గణేశుడి.. వీడియో చూశారా..!