GGH Workers Issues | జీజీహెచ్​లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జీజీహెచ్​లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: GGH Workers Issues | జీజీహెచ్​లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కోరారు. ఈమేరకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy)కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

GGH Workers Issues | సిబ్బంది కొరత

వారు మాట్లాడుతూ జీజీహెచ్​లో ప్రతిరోజు ఓపీ 2,500, ఐపీ 200కు పెరిగినందున ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదన్నారు. గతంలో 750 పడకలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం చేసిన బడ్జెట్ కేటాయించక లేకపోవడంతో సిబ్బందిని పెంచలేదన్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పని భారం పెరిగి అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బడ్జెట్ కేటాయించి, కార్మికుల వేతనాలు పెంచడంతోపాటు, కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Kamareddy RTC Driver | కామారెడ్డిలో విషాదం.. ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *