Nizamabad Police RI | తుపాకి పేలి ఆర్ఐ మృతి.. నివాళులర్పించిన సీపీ

నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో తుపాకీ మిస్​ఫైర్​ కావడంతో రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ సతీష్​ మరణించాడు. ఆయనకు సీపీ సాయిచైతన్య నివాళులర్పించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం:  Nizamabad Police RI | నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో తుపాకీ మిస్​ఫైర్​ కావడంతో రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ సతీష్​ మరణించాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

 Nizamabad Police RI | నివాళులర్పించిన సీపీ..

మిస్​ఫైర్​లో ఆర్​ఐ మృతి చెందడంతో సమాచారం అందుకున్న సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, నిజామాబాద్​ ఏసీపీ ప్రకాష్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ కృష్ణస్వామి, సీసీఎస్​ ఏసీపీ శ్రీశైలం, టాస్క్​ఫోర్స్ ఏసీపీ నరేందర్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేశం సీఐలు, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సతీష్​ మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన ఖమ్మం జిల్లాలోని ఇల్లెందుకు తరలించారు.

ఇది కూడా చదవండి..: Star Health Nizamabad | ‘స్టార్​ హెల్త్​’ నిజామాబాద్​లో విస్తృతమైన సేవలందిస్తున్నాం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *