అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: State Level Yoga Competitions | కరీంనగర్ (Karimnagar)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ చూపిందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
State Level Yoga Competitions | 13వ రాష్ట్రస్థాయి యోగా పోటీలు..
కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు జరిగాయని.. ఈ క్రీడల్లో తమ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ సుభాష్ నగర్ బ్రాంచ్లో పదో తరగతి చదువుతున్న స్మైత్రిక చారి ప్రతిభ చూపి బంగారు పతకం సాధించారన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని దాదాపు 22 జిల్లాల నుండి వెయ్యి మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. గెలుపొందిన విద్యార్థులు అక్టోబర్ 3 నుండి 7 వరకు జైపూర్లోని రాజస్థాన్లో జరుగనున్న 51 జాతీయస్థాయి యోగాసన పోటీలలో పాల్గొంటారన్నారు. తమ విద్యాసంస్థల నుండి స్మైత్రిక చారి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉప ప్రధానోపాధ్యాయురాలు భావన ఠాకూర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, యోగా కోచ్ గంగాధర్ అభినందనలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి..: Gandhari Ganja Cultivation Bust | అధిక లాభాల ఆశతో గంజాయి సాగు..భగ్నం చేసిన గాంధారి పోలీసులు!