Cases on Farmers | రైతులపై అక్రమ కేసులు.. కేటీఆర్​ ఆగ్రహం

జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్​ చేసి బీఆర్ఎస్ నేతలను, రైతులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఖండించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cases on Farmers | జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్​ చేసి బీఆర్ఎస్ నేతలను, రైతులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఖండించారు. రాష్ట్రంలో సాగుతున్న అణచివేతకు ఇది ఉదాహరణ అని ఆయన అన్నారు.

జూరాల ఆయకట్టుకు నీరందించాలని బీఆర్​ఎస్​ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. జూరాల ప్రాజెక్ట్​కు వెళ్లే మార్గాలను మూసి వేశారు. దీనిపై ఎక్స్​ వేదికగా కేటీఆర్​ స్పందించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకోవడానికి రైతులు జూరాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తే.. ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నదాతలను అరిగోస పెడుతున్నారని పేర్కొన్నారు.

Cases on Farmers | పాలన చేతగాక..

సీఎం రేవంత్​రెడ్డికి పాలన చేతగాక, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు ఆదేశాలిచ్చారని విమర్శించారు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు ఉందని, తాగునీటికి 2 టీఎంసీలు సరిపోతాయన్నారు. అయినా కూడా రైతులకు సాగునీరు విడుదల చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. అరెస్టు చేసిన రైతులను, బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Danam Nagender | దానం నాగేందర్ అనర్హత కేసులో బిగ్ అప్‌డేట్..బుధవారం సుప్రీంకోర్టులో విచారణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *