అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad ACB Trap | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. లంచం తీసుకుంటుండగా ఓ జూనియర్ అసిస్టెంట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పాల్దా అశోక్ జూనియర్ అసిస్టెంట్ (ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్)గా, కలకంట్ల కిరణ్ కుమార్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (ఆడిట్ సెక్షన్)గా పని చేస్తున్నారు. ఓ మహిళకు సంబంధించిన పెన్షన్ మంజూరు కోసం ఆమె సర్వీస్ బుక్లో ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ తయారు చేసి, అవసరమైన ఎంట్రీలు, ఇతర వివరాలను నమోదు చేయడం కోసం ఇద్దరు ఉద్యోగులు రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ మహిళ కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Nizamabad ACB Trap | వల పన్ని..
జూనియర్ అసిస్టెంట్ అశోక్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కిరణ్కుమార్ సోమవారం నగరంలోని రాజారాజేంద్ర చౌరస్తా సమీపంలో ఉన్న సీతారామ్నగర్ కాలనీలోని పద్మశాలి సంఘం వద్ద ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Ramya Rao Allegations | చెప్పులు లేని సంతోష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి?.. కేటీఆర్కు రమ్యరావు ప్రశ్న