అక్షరటుడే, కామారెడ్డి: Chakali Ailamma | సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) కొనియాడారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
Chakali Ailamma | అణగారిన వర్గాల కోసం..
పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన తెగువ, నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె చేసిన పోరాటం ప్రజాస్వామ్య విలువలను, సమానత్వాన్ని బలోపేతం చేసిందని, ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, గౌరవం కల్పించడమే నిజమైన నివాళి అని తెలిపారు. ఆమె స్ఫూర్తితో సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, తహశీల్దార్ హిమబిందు, బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి, వైస్ ఛైర్పర్సన్ గోదావరి స్వామి, టీఎన్జీవోస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Chakali Ailamma Jayanti | చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం : టీపీపీసీ చీఫ్