House Fire in Nizamabad | ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు..

అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు దగ్ధమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: House Fire in Nizamabad | అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన నిజామాబాద్​ (Nizamabad) నగరంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

House Fire in Nizamabad | హన్మాన్​ నగర్​లో..

నగరంలోని పూలాంగ్​ సమీపంలోని హన్మాన్​ నగరంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో మంటలు లేచాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు రావడంతో దట్టంగా పొగ నిండుకుంది. స్థానికులు గమనించి వెంటనే ఫైర్​ స్టేషన్​కు సమాచారం అందించారు. స్పందించిన ఫైర్​ సిబ్బంది డీఎఫ్​వో పరమేశ్వర్​, జిల్లా ఫైర్​ అధికారి శంకర్​ నేతృత్వంలో సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే జీజీహెచ్​కు తరలించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Pochampad Road Accident | కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం.. గ్రామస్థుల ధర్నా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *