అక్షరటుడే, వెబ్‌డెస్క్: Emergency Landing | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో 591 ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Emergency Landing | విజయవాడ వెళ్తుండగా..
శంషాబాద్ (Shamshabad) నుంచి 591 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం విజయవాడ వెళ్లేందుకు బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలెట్ గుర్తించారు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించాడు. అనంతరం విమానాన్ని తిరిగి శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి..: HYDRAA | 6 వేల గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా