Medical College Workers | మెడికల్ కళాశాలలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, యూనియన్ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Medical College Workers | మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు కళాశాల ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు.

Medical College Workers | పనిభారం పెరిగింది..

నిజామాబాద్ మెడికల్ కళాశాలలో గతంలో కంటే ప్రస్తుతం కోర్సులు పెరిగాయని ఓమయ్య తెలిపారు. తద్వారా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. దీంతో పనిభారం పెరిగిందని.. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై పనిభారం పడుతోందన్నారు. కావున వెంటనే కార్మికుల సంఖ్యను పెంచడంతో పాటు, సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును అనుసరించి కనీస వేతనాల పెంపు, జాతీయ పండుగలకు ఆర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. నగరంలోని ఉన్న జీజీహెచ్​, ఎంసీహెచ్​లలో ఐపీ పెరిగినందున వెంటనే 750 పడకలకు పెంచి శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని కోరారు. బోధన్ జిల్లా ఆస్పత్రి, జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నెల హన్మాండ్లు, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఫిరోజ్, నాయకులు కవిత, స్వప్న, స్వరూప, వెంకటేష్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Guru Paduka Shobhayatra | కామారెడ్డిలో భక్తిశ్రద్ధలతో గురుపాదుకల శోభాయాత్ర

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *