అక్షరటుడే, వెబ్‌డెస్క్: BC Chief Minister | భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. శంషాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
BC Chief Minister | బీసీలకు సముచిత ప్రాధాన్యం..
బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రావాలనే అంశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఇస్తారని ఆయన అన్నారు.
BC Chief Minister | రాహుల్ గాంధీ ప్రధాన కారణం
బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అంశాలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోందని తెలిపారు. బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా మాట్లాడటానికి రాహుల్ గాంధీ ప్రధాన కారణమని మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
BC Rights | బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు : పీసీసీ చీఫ్
ఓబీసీ కులగణన ద్వారా బీసీల జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన సమాచారం లభిస్తుందని, తద్వారా వారికి మరింత మెరుగైన అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలు కలుగుతుందని సభలో వక్తలు పేర్కొన్నారు.