DMHO Caught by ACB | రూ.లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్​వో

రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్​వో స్వర్ణకుమారి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: DMHO Caught by ACB | రంగారెడ్డి (Rangareddy) జిల్లా డీఎంహెచ్​వో స్వర్ణకుమారి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ మేరకు కార్యాలయంలో అధికారులు సోమవారం దాడులు చేపట్టారు.

రాజేంద్రనగర్​లోని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్​వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హెల్త్​ ఇన్​స్పెక్టర్​, ఓ ప్రైవేట్​ డ్రైవర్​ ద్వారా డీఎంహెచ్​వో స్వర్ణకుమారి లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. జిల్లాలోని ఓ ప్రైవేట్​ ఫిజియోథెరపీ సెంటర్​ను ఇటీవల వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. దానిని తిరిగి తెరవడానికి అనుమతి కోసం డీఎంహెచ్​వో రూ.రెండు లక్షల లంచం డిమాండ్​ చేశారు.

DMHO Caught by ACB | డ్రైవర్​ ద్వారా..

హెల్త్​ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​ డ్రైవర్​ మద్దురి కృష్ణయ్య ద్వారా డీఎంహెచ్​వో లంచం అడిగారు. ఈ మేరకు కృష్ణయ్య సోమవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఈ కేసులో డీఎంహెచ్​వో స్వర్ణకుమారి, హెల్త్​ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​పై సైతం కేసు నమోదు చేశారు.  డ్రైవర్​ కృష్ణయ్య డీఎంహెచ్​వో, హెల్త్ ఇన్‌స్పెక్టర్ తరపున మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్​కు తరలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : BC Commission Visit | 7న నిజామాబాద్​కు బీసీ కమిషన్​.. వీడీసీల బహిష్కరణలపై సమావేశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *