Sudhakar Death | భీమ్​గల్​ ఠాణాలో ఆత్మహత్యకు యత్నించిన ఛాయ్​వాలా మృతి

నా పరిస్థితి తెలిసి కూడా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మూడోసారి కూడా ఫైన్ వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాను....

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sudhakar Death | నిజామాబాద్​ Nizamabad లోని భీమ్​గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఛాయ్​వాలా సుధాకర్ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Sudhakar Death | పలువురు వేధిస్తున్నారని కారణంతో..

పలువురు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సదరు టీ స్టాల్ యజమాని సుధాకర్ సోమవారం ఉదయం భీమ్​గల్​ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పుటించుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Sudhakar Death | సీపీ సాయి చైతన్య వివరణ..

సుధాకర్ ఘటనకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని సీపీ సాయి చైతన్య సోమవారం వివరణ ఇచ్చారు. భీమ్​గల్​ పట్టణవాసి సుధాకర్​ బస్టాండ్​ సమీపంలో టీ స్టాల్​ నడుపుతున్నాడు. అయితే అతడి షాప్​నకు ఎదురుగా ఉన్న కిరాణాషాప్​లో సుధాకర్​ సిగరెట్లు కొనడం లేదని.. ఆ షాప్​ యజమాని ఇద్దరు విలేకరులను పంపించి ఆయనను బెదిరించారన్నారు.

అలాగే సుధాకర్​ టీస్టాల్​ రాత్రి 10.30 తర్వాత కూడా తెరిచి ఉండటంతో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా చూసి పీటీ కేసు పెట్టినట్లు సీపీ తెలిపారు. విలేకరులు బెదిరించిన అంశాన్ని మనసులో పెట్టుకున్న సుధాకర్​ సోమవారం ఉదయం పోలీస్​స్టేషన్​కు వచ్చి ఆవరణలో నిప్పంటించుకున్నట్లు పోలీస్​ కమిషనర్​ వివరించారు. ఈ విషయంలో పోలీసు వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *