Hyderabad Police Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో 16 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police Transfers | హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ నగర​ కమిషనర్​ వీసీ సజ్జనార్​ (VC Sajjanar) ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన మార్పులలో భాగంగా 16 మంది ఇన్‌స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేశారు. నగరం అంతటా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, శాంతిభద్రతల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా బదిలీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Hyderabad Police Transfers | బాలాపూర్​ ఎస్​హెచ్​వోగా నాగరాజు..

ఐఎస్​ సదన్​ ఎస్​హెచ్​వో నాగరాజు బాలాపూర్​ ఠాణా ఎస్​హెచ్​వోగా బదిలీ అయ్యారు. ఐఎస్ సదన్​ డీఐ సాయి ప్రకాశ్​ గౌడ్​ అదే ఠాణా ఎస్​హెచ్​వోగా నియమితులయ్యారు. విజయ్​ మోహన్​ రాజేంద్ర నగర్​ డీఐగా, ​ఆదిబట్ల డీఐగా కేసరి ప్రసాద్, హెచ్​ న్యూ విభాగంలో పని చేస్తున్న బాలస్వామి నాంపల్లి డీఐగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

Hyderabad Police Transfers | వీఆర్​ నుంచి సీసీఎస్​కు..

సైబర్​ క్రైమ్స్​లోని జయశంకర్​ను​ జూబ్లీహిల్స్​ డీఐగా, ఎం సుధాకర్​ను స్పెషల్​ బ్రాంచ్​కు, రాఘవేందర్​ను హెచ్​–న్యూ విభాగానికి బదిలీ చేశారు. వీఆర్​లో ఉన్న కమల్​కుమార్​, రవికుమార్​, నర్సింహలను సీసీఎస్​కు పంపించారు. వీఆర్​లోని ముత్తు యాదవ్​ను సికింద్రాబాద్​ టాస్క్​ఫోర్స్​కు, యదేందర్​ను చార్మినార్​ జోన్​ టాస్క్​ఫోర్స్​కు, రాజశేఖర్​ను జూబ్లీహిల్స్​ జోన్​కు, సైదాబాబును చిలకలగూడ ఠాణా డీఐగా బదిలీ చేశారు. జూబ్లీహిల్స్​ ఠాణా డీఐ సత్యనారాయణను వీఆర్​కు అటాచ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: ATM Robbery | గ్యాస్​కట్టర్​​తో కట్​ చేసి.. ఏటీఎంలో చోరీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *