Deaf Students Police Awareness | బధిరుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకోవాలి: సీపీ సాయిచైతన్య

బధిరుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Deaf Students Police Awareness | బధిరుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) అన్నారు. నగరంలోని (Nizamabad) టౌన్–4 పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేసి ఆర్గనైజషన్ ఫర్ డెవలప్​మెంట్​ సర్వీసెస్ లో బధిర విద్యార్థులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు , ఇబ్బందులు , వాటి పరిష్కారంలో పోలీసుల పాత్రపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు.

Deaf Students Police Awareness | సున్నితమైన సమస్యలు..

సమాజంలో బధిర విద్యార్థులు వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఇబ్బందులను పోలీసులు ఓపికగా విని అర్థం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా బధిరులు తమ సమస్యలను సాధారణంగా మాట్లాడి తెలియజేయలేని పరిస్థితుల్లో వారి తమ సైగలతోనే వ్యక్తపరుస్తారని తెలియజేశారు. వారు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారితో ఎలా సామరస్యంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలనే అంశాలపై పోలీసు సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా గ్రేసీ ఫౌండేషన్​ సంస్థలో విద్యార్థులతో ఆత్మీయంగా మెలుగుతూ, వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, ఏసీపీ ప్రకాష్, గ్రేసీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు శోభారాణి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Deaf Students Police Awareness, CP Saichaitanya, Nizamabad Police, Deaf Students, Police Training, Grace Organization, Disability Awareness, Nizamabad News

ఇది కూడా చదవండి: ‘హనుమాన్ అంశ్’.. తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *