Ganja Seller Arrest | గంజాయి విక్రేత అరెస్ట్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganja Seller Arrest | నిజామాబాద్ (Nizamabad)​ నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీఐ గ్రౌండ్​లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు.

పోలీసుల దాడి సమయంలో ఓ వ్యక్తి యాక్టివా స్కూటర్​పై కూర్చొని ఉండగా.. ముగ్గురు అతడి వద్ద గంజాయి కొని సేవిస్తున్నారు. పోలీసులను చూడగానే వారు పారిపోయే యత్నం చేశారు. అనంతరం పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్​ టెస్ట్​ చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ganja Seller Arrest | మహారాష్ట్ర నుంచి..

ఈ కేసులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని నగరంలోని అసద్​ బాబా నగర్​కు చెందిన షేక్​ పర్వేజ్​గా గుర్తించాడు. అతడు మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన ఫుర్ఖాన్, నిజామాబాద్​కు చెందిన అఫ్రోజ్ అనే వ్యక్తి దగ్గర గంజాయి ప్యాకెట్లు తక్కువ ధరకు కొని.. తాగేవారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి తాగుతూ పట్టుబడిన ముగ్గురు యువకుల వయసు 25 ఏళ్లలోపు ఉండటం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Kishan Reddy Rahul Gandhi | రాష్ట్రంలో అరెస్టులు.. ఢిల్లీలో ఉపన్యాసాలా?..రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *