అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Gambling Raid | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూదరులు పేట్రేగిపోతున్నారు. నలుగురు కలిస్తే.. ముక్క కలిపేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ Nizamabad నగరంలో తొమ్మిది మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nizamabad Gambling Raid | గేటుకు తాళం వేసుకుని మరీ…
నగరంలోని నాలుగో ఠాణా పరిధిలో ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా ఉన్న భవనంలో జూదరులు గేటుకు తాళం Lock వేసుకుని మరీ లోపల పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారం మేరకు ఠాణా ఎస్‌హెచ్‌వో సతీష్ తన సిబ్బంది కలిసి శనివారం అర్ధరాత్రి పేకాట స్థావరానికి చేరుకున్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Nizamabad Gambling Raid | రెండు గంటల పాటు బయటే..
కాగా, పోలీసులు దాడి చేసిన విషయాన్ని పసిగట్టిన జూదరులు గేటుకు తాళం తీయకుండా రెండు గంటల పాటు లోపలే ఉండిపోయారు. అయినా, వారు బయటకు వచ్చే వరకు పోలీసులు వదలకుండా వేచి చూశారు. చివరకు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తొమ్మిది మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.50 లక్షల నగదు, 9 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.