అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khammam Car Fire | ఖమ్మం (Khammam) కలెక్టరేట్ సమీపంలో కారు దగ్ధమైంది. కొత్తగూడెం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
మహబూబాబాద్‌కు చెందిన వారు కారులో కొత్తగూడెం వైపు వెళ్తున్నారు. ఖమ్మంలోని కలెక్టరేట్ వద్దకు రాగానే.. కారులో పొగలు రావడాన్ని వారు గమనించారు. వెంటనే పక్కన నిలిపి బయటకు వచ్చారు. అనంతరం క్షణాల్లోనే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Khammam Car Fire | షార్ట్ సర్క్యూట్‌తో..
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Gadpotaram Gas Leak | గడ్డపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి