అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: KGBV Inspection | తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.
KGBV Inspection | ఫిర్యాదులపై ఆరా
అనంతరం కిచెన్ ఆవరణ, ఫ్రీజర్, సరుకులు తనిఖీ చేసి.. అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. అలాగే కంప్లైంట్స్ బాక్స్‌ను పరిశీలించి.. ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. కంప్లైంట్స్ బాక్స్‌లో వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని, ఆయా సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Telangana Land Resurvey | భూముల రీసర్వేకు రైతులు సహకరించాలి..: అదనపు కలెక్టర్