అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Child Protection Awareness | బాలల రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి అన్నారు. సురక్షిత్ బచ్పన్ అభియాన్లో భాగంగా మహాత్మ జ్యోతిబాపూలే (Mahatma Jyotibapule) బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Child Protection Awareness | అవగాహన కల్పించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు నీరజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లక్ష్మణచారి మాట్లాడుతూ.. పిల్లలకు తమ హక్కుల గురించి, మంచి స్పర్శ–చెడు స్పర్శ గురించి వివరించాలన్నారు. అపరిచితులు లేదా తెలిసిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల గురించి వయస్సుకు తగిన రీతిలో అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుష్మిత, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు పెంట శ్రీనివాస్, ఆడెపు వేణు, కళ్యాణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Prajavani Rajanna Sircilla | ప్రజావాణితో సమస్యల పరిష్కారం..: కలెక్టర్ గరిమ అగ్రవాల్