అక్షరటుడే, కామారెడ్డి: NHM Employees Issues | ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కలెక్టరేట్ లో సమావేశానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు కలిశారు.
NHM Employees Issues | ఆరోగ్యశాఖా మంత్రితో ..
తాము సమ్మె చేస్తున్న ఉద్దేశ్యాన్ని షబ్బీర్ ఆలీకి ఎన్హెచ్ఎం ఉద్యోగులు వివరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన షబ్బీర్ అలీ (Shabbir Ali) వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చిస్తానని తెలిపారు. డిమాండ్ల సాధనకు కృషి చేస్తానన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులు మాట్లాడుతూ.. చాలాకాలంగా సమాన పనికి సమాన వేతనం, జాబ్ సెక్యూరిటీ, పెండింగ్ జీతాలు, ఆరోగ్య భద్రత తదితర డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నట్టుగా తెలిపారు. సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతరాయం కలుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు హామీతో ఉద్యోగులు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తూ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Prashanth Reddy Sports | చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి.. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి