IAS Transfers | పలువురు ఐఏఎస్​ అధికారుల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: IAS Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం హెచ్​ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయేష్ రంజన్‌ను పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా బదిలీ చేశారు. అదనంగా, EPTRI డైరెక్టర్ జనరల్ బాధ్యతలను అప్పగించారు. శైలజా రామయ్యర్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించారు. 1992 బ్యాచ్​కు చెందిన వికాస్​ రాజ్​ను రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి నుంచి ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా బదిలీ చేశారు. నవీన్ మిట్టల్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించి రవాణా, రోడ్లు భవనాలు, రెవెన్యూ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమించారు.

IAS Transfers | క్రీడా శాఖ డైరెక్టర్​గా అవని ప్రసాద్​

అవని ప్రసాద్‌ను క్రీడలు, క్రీడా శాఖ డైరెక్టర్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను అప్పగించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా శైలజా రామయ్యర్​ను ట్రాన్స్​ఫర్​ చేశారు. 2000 బ్యాచ్​కు చెందిన రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అదనపు బాధ్యతలు అప్పగించారు. సబ్యసాచి ఘోష్‌ను గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా కె ఇలంబర్తి బదిలీ అయ్యారు. ఆయనకు అదనంగా రవాణా కమిషనర్ బాధ్యతలను అప్పగించారు.

IAS Transfers | జీహెచ్​ఎంసీ ప్రత్యేకాధికారిగా..

హెచ్​ఎండీఎ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా సర్ఫరాజ్​ అహ్మద్​కు అడిషనల్​ ఛార్జ్​ ఇచ్చారు. అంతేగాకుండా జీహెచ్​ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రెటరీగా శృతి ఓజా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మహమ్మద్ ముషరఫ్ అలీ ఫరూఖీని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణను బదిలీ చేశారు. జితేశ్​ వి పాటిల్ఖు TGREDCO వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.

ఇది కూడా చదవండి..: Arnab Cyclone | అర్నబ్​ తుపాన్​ బీభత్సం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *