Fox Sagar Lake | ఫాక్స్ సాగ‌ర్ చెరువు పునరుద్ధణకు హైడ్రా చర్యలు

జీడిమెట్ల ప్రాంతంలోని ఫాక్స్​ సాగర్​ చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fox Sagar Lake | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చెరువులను పునరుద్ధరించింది. తాజాగా జీడిమెట్ల ప్రాంతంలోని ఫాక్స్ సాగ‌ర్ చెరువు పున‌రుద్ధ‌ర‌ణకు చర్యలు చేపట్టింది.

నగరంలోని బతుకమ్మ కుంట, నల్ల చెరువు, సున్నం చెరువు తదితర చెరువులను ఇప్పటికే హైడ్రా అభివృద్ధి చేసింది. పలు చెరువుల పనులు సాగుతున్నాయి. త్వరలో ఫాక్స్​ సాగర్​ చెరువు పనులను సైతం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో హైడ్రా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ‌నివారం చెరువు క‌ట్టపై ఉన్న పిచ్చి మొక్క‌ల‌ను తొలగించారు. ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త‌ను అక్కడి నుంచి తరలించే పనులు చేపట్టారు. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న ఈ చెరువుకు పూర్వ వైభ‌వం తీసుకు వస్తామని హైడ్రా పేర్కొంది.

 Fox Sagar Lake | ఆల‌య క‌మిటీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశం

ఫాక్స్ సాగ‌ర్ క‌ట్ట‌ను ఆనుకొని పలు ఆలయాలు నిర్మించారు. ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులతో శనివారం హైడ్రా, పోలీస్ అధికారులు స‌మావేశ‌మ‌య్యారు. క‌ట్ట‌ను బ‌లోపేతం చేయ‌నున్న నేపథ్యంలో ఆల‌యాల‌న్నిటీని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించేందుకు సహకరించాలని కోరారు. ఒకప్పుడు తాగు, సాగు నీటి అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో కీలకంగా ఉన్న ఈ చెరువుకు పూర్వ వైభవం తీసుకు వస్తామని, స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైడ్రా ఏసీపీ తిరుమ‌ల్, కుత్బుల్లాపూర్ ఏసీపీ శంక‌ర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Greyhounds Land | 10 ఎకరాల గ్రేహౌండ్స్​ భూమిని ఇతరులకు కట్టబెట్టిన సీఎం : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *