Crime News | ప్రేమికులపై దాడి చేసి, చున్నీ లాగి అసభ్య ప్రవర్తన.. నగదు, స్కూటీతో పరారైన ముగ్గురు నిందితులపై కేసు నమోదు

ఈ తరహా ఆకతాయి చర్యలను ఉపేక్షించేది లేదని, నిందితులను త్వరలోనే అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crime News | నిజామాబాద్ Nizamabad నగరంలో మహిళా భద్రతకు సవాలు విసురుతూ కొందరు అకతాయిలు దౌర్జన్యానికి దిగారు. కాబోయే భర్తతో మాట్లాడేందుకు వెళ్లిన ఓ యువతి పట్ల ముగ్గురు వ్యక్తులు అత్యంత నీచంగా ప్రవర్తించడమే కాకుండా, వారిపై దాడి చేసి నగదు, వాహనం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై నిజామాబాద్ V (ఐదవ) టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Crime News | మహిళ పట్ల అసభ్య ప్రవర్తన..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1న నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్‌లో బాధిత మహిళ తన కాబోయే భర్త తో కలిసి మాట్లాడుకుంటోంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ముగ్గురు ఆకతాయిలు వారిపైకి దూసుకొచ్చారు. బాధిత మహిళ చేయి పట్టుకుని లాగుతూ, ఆమె చున్నీని లాగి తీవ్రంగా అసభ్యకరంగా ప్రవర్తించారు.

అంతటితో ఆగకుండా, తమకు రూ. 1,50,000 డబ్బులు ఇవ్వాలని తీవ్రంగా డిమాండ్ చేశారు. బాధితులు నిరాకరించడంతో వారిపై చేతులతో విచక్షణా రహితంగా దాడి చేసి, చంపుతామని బెదిరించారు. అనంతరం బాధితుల వద్ద ఉన్న రూ. 4,000 నగదుతో పాటు, వారి TG 16 E 6314 నంబర్ గల యాక్టివా స్కూటీని బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.

Crime News | నిందితుల కోసం తీవ్ర గాలింపు

బాధితులు వెంటనే నిజామాబాద్ V (ఐదో) టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దౌర్జన్యానికి పాల్పడిన నిందితులను గోడలే గణేష్, ప్రమోద్, పరమేశ్వర్‌గా గుర్తించినట్లు V టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాస్ తెలిపారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ డి. సునీల్ వివరించారు. ఈ తరహా ఆకతాయి చర్యలను ఉపేక్షించేది లేదని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *