అక్షరటుడే, బాన్సువాడ/కోటగిరి: Tree Falls on Auto | ఆటోపై మర్రిచెట్టు పడడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రుద్రూర్ శివారులో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
Tree Falls on Auto | బాన్సువాడ–బోధన్ ప్రధాన రహదారిపై..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ–బోధన్ ప్రధాన రహదారిపై రుద్రూర్ శివారులోని కామధేను రైస్ మిల్ వద్ద మూల మలుపు సమీపంలో భారీ మర్రిచెట్టు ఒక్కసారిగా కూలి అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న ఆటోపై పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Tree Falls on Auto | బడాపహాడ్ దర్గాను దర్శించుకుని..
బడా పహాడ్ దర్గాను దర్శించుకుని తిరిగి బోధన్ (Bodhan)కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. చెట్టు ఆటోపై పడటంతో రహమత్, గౌస్ బేగం, షేక్ అజీ, అలీమ్, నియాన్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోతంగల్ 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 108 పైలెట్ కాసిం, ఈఎంటీ నారాయణ తక్షణమే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి..: Fake Certificates | పేట్రేగిపోతున్న సర్టిఫి‘కేటు’గాళ్లు.. కామారెడ్డిలో వెలుగుచూస్తున్న ఘటనలు