Telangana Activist Laxman | ప్రభుత్వ తీరుతోనే ఉద్యమకారుడు లక్ష్మణ్​ ఆత్మహత్య : హరీశ్​రావు

తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Activist Laxman | తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. ఆయన మృతి ఎంతగానో కలచి వేసిందని పేర్కొన్నారు.

జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని హరీశ్​రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డితో కలిసి మంగళవారం పరామర్శించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించారు. లక్ష్మణ్​ భార్యకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని రాజేశ్వర్‌ రెడ్డి చెప్పారన్నారు.

Telangana Activist Laxman | వేధింపులతో..

కాంగ్రెస్​ ప్రభుత్వం, నాయకుల వేధింపులతో లక్ష్మణ్​ ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్​రావు ఆరోపించారు. ఆయనపై మైనింగ్ కేసు పెట్టి, జేసీబీ సీజ్ చేశారన్నారు. నెలలుగా దానిని విడుదల చేయకపోవడంతో పాటు జరిమానాలు వేయడంతో లక్ష్మణ్​కు అప్పులు పెరిగాయన్నారు. లక్ష్మణ్​ తనకున్న 7 ఎకరాలతో పాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేవాడని చెప్పారు. అయితే ఈ ఏడాది చెరువులోకి నీరు రాకపోవడంతో పంట ఎండిపోయి అప్పుల పాలు అయ్యాడన్నారు. మరోవైపు ఆయన సొంత భూమిని కాంగ్రెస్​ నాయకుడి పీఆర్వో చెప్పడంతో అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. దీంతో మనస్తాపం చెంది లక్ష్మణ్​ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Onion Prices | తెలంగాణలో సెంచరీకి చేరువలో ఉల్లి ధర.. సామాన్యుడి జేబుకు చిల్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *