అక్షరటుడే, భీమ్గల్: Armoor Court Judges | ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం లక్ష్మీనరసింహస్వామిని ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.
Armoor Court Judges | కార్తీకమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని..
ఈ నేపథ్యంలో లక్ష్మీనరసింహ స్వామిని ఆర్మూర్ (Armoor) కోర్టు సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి భవ్యశ్రీ దర్శించుకున్నారు. స్వామివారి కార్తీకమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యామని గుర్తుచేసుకున్నారు. న్యాయమూర్తుల పర్యటన సందర్భంగా భీమ్గల్ ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: Sri Krishna Foundation | సర్కారు స్కూళ్లకు బాసటగా నిలుస్తోన్న శ్రీకృష్ణ ఫౌండేషన్..