అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Pension Criticism | పింఛన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నగరంలో(Nizamabad) మీడియాతో ఆయన మాట్లాడారు.
Pension Criticism | సీతక్క, పీసీసీ చీఫ్‌కు సవాల్..
జిల్లాలో కేసీఆర్ హయాంలో ఇచ్చిన సుమారు 17వేల పింఛన్లను తొలగించి.. కొత్తగా 20వేల పింఛన్లు ఇచ్చారని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో అలా చేయలేదని నిరూపించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమర్ గౌడ్‌కు తాను సవాల్ విసురుతున్నాన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో కేవలం 3వేల పింఛన్లు మాత్రమే కొత్తగా ఇస్తున్నారన్నారు. దీనికి పింఛన్ల పండగ పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పింఛన్ల పంపిణీపై చర్చకు తాను సిద్ధమని.. తనది తప్పయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
Pension Criticism | ఇచ్చిన హామీలు ఏళ్లుగా పెండింగ్..
ఇచ్చిన హామీలను ఏళ్లుగా పెండింగ్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీడీ కార్మికులు, వృద్ధులు, మహిళలు మొత్తంగా 3 లక్షల మంది పింఛన్ల కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో అబద్ధపు ప్రమాణాలతో గద్దెనెక్కారని.. రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పిమాట తప్పారన్నారు. మహిళలకు బాకీపడ్డ పింఛన్లు ఇవ్వకుంటే వారే ఎక్కడికక్కడ నిలదీస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బురద నీళ్లూ తోడేందుకు.. ఏపీ కుట్ర