Krishna River Water | ఏపీ జల దోపిడీకి కేసీఆర్ కారణం : సీఎం రేవంత్​ రెడ్డి

ఏపీ జల దోపిడీకి పాల్పడటానికి కేసీఆరే కారణమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Krishna River Water | ఏపీ జల దోపిడీకి పాల్పడటానికి కేసీఆరే కారణమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కేసీఆర్​, హరీశ్​రావు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసి, రాష్ట్ర హక్కులను జలసమాధి చేశారన్నారు. వారిని ఉరి తీసిన తప్పు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్​లో సోమవారం సాయంత్రం సీఎం మీడిమాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడానికి 2005-06 బడ్జెట్ ఆమోదమే ప్రధాన కారణమని చెప్పారు. ఆ బడ్జెట్‌కు మంత్రివర్గం, శాసనసభ ఆమోదం తెలిపిన సమయంలో హరీష్ రావు వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారని గుర్తుచేశారు.

Krishna River Water | ఏబీసీడీలు రాని వారు వెళ్లి..

బర్రెలు కాసుకునే వాళ్లు, ఏబీసీడీలు రాని వాళ్ళు, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్లు కాళేశ్వరం దగ్గరికి పోయి ఫొటోలు పెడుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు. నీళ్లు ఎత్తి పోయాలని చెప్తున్నారని, పోయే నీళ్లను ఎత్తేటట్టు ఉంటే.. బ్యారేజ్ నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు. కేవలం పంప్ హౌస్ కడితే చాలు కదా అన్నారు. మేడిగడ్డను రాత్రికి రాత్రి రిపేర్​ చేయలేమని స్పష్టం చేశారు. NDSA రిపోర్ట్ ప్రకారం ఒక సిస్టమ్యాటిక్‌గా చేయాలన్నారు. ఈ కరువు కాలంలో ఏపీ 132 టీఎంసీలు వాడుకుంటే, తమ ప్రభుత్వం 110 టీఎంసీలు వాడుకుందన్నారు.

Krishna River Water | జగన్​తో రహస్య ఒప్పందాలు

కేసీఆర్​, జగన్​తో రహస్య ఒప్పందాలు చేసుకొని తెలంగాణకు అన్యాయం చేశారని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. జగన్‌ ప్రగతి భవన్‌లో విందుకు హాజరైతే.. కేసీఆర్‌ రాయలసీమకు వెళ్లి రొయ్యల పులుసు తిన్నారని విమర్శించారు. ఆ తర్వాత ఇద్దరూ పల్నాడు తాగునీటి ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొన్నారు. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అలుసు, అనుమతుల కొనసాగింపుతోనే నేడు నాగార్జునసాగర్ సమీపంలో పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *