అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Seethakka Apology | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, మంత్రి సీతక్క క్షమాపణ చెప్పారు. ఆమె గురించి మాట్లాడుతుండగా.. పొరపాటున వచ్చిన మాటను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
మంత్రి సీతక్క సోమవారం ములుగు జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై విమర్శలు చేశారు. ఇటీవల కవిత తనకు క్యాన్సర్ ఉందని కేటీఆర్ ప్రచారం చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సీతక్క, కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సొంత చెల్లికి క్యాన్సర్ ఉందని ప్రచారం చేయించారని అనబోయి ఎయిడ్స్ అన్నారు. దీనిపై తాజాగా ఆమె క్షమాపణ చెప్పారు. కవిత ప్రస్తావన రావడంతో కాన్సర్ పదానికి బదులుగా వేరే పదం పొరపాటుగా మాట్లాడినందుకు సారీ చెప్పారు.
Seethakka Apology | పొరపాటున దొర్లింది
కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి ఒక మహిళా నాయకురాలిపై దారుణ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని పేర్కొంది. ఈ క్రమంలో సీతక్క వీడియో విడుదల చేశారు. ఆ పదం అనుకోకుండా దొర్లిందన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనలేదని చెప్పారు. వ్యక్తులను రాజకీయంగా ఎదురుకుంటాం కానీ వ్యక్తిగతంగా తూలనాడమని ఆమె స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయడంతో, క్యాన్సర్‌కు బదులు ఎయిడ్స్ అని వచ్చిందన్నారు. దీనిపై క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు.
సీతక్క ❤️😍
చేయూత పెన్షన్లలో మాట్లాడుతున్న సమయంలోనే కవిత గారి ప్రస్తావన రావడంతో కాన్సర్ పదానికి బదులుగా వేరే పదం పొరపాటుగా మాట్లాడినందుకు కవితక్క కు క్షమపణ చెప్పిన సీతక్క..
ఈ సందర్బంగా వ్యక్తులను రాజకీయంగా ఎదురుకుంటాం కానీ వ్యక్తిగతంగా తూలనాడమని స్పష్టం చేశారు https://t.co/ANqQMnOvC8
— AshaPriya Mudiraj 🇮🇳 (@ashapriya09) November 24, 2026
దీనిని కూడా చదవండి : Fake Currency Scam | నకిలీ నోట్లతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్