Khelo India Youth Games | రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మారుస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khelo India Youth Games | తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో తొలిసారి నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​ ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు.

యువతలో నూతన ఉత్సాహం కలిగించే విధంగా అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రారంభ వేడుకలను ఎల్బీ స్టేడియంలో, ముగింపు వేడుకలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా హైదరాబాద్ నగరమంతా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.

Khelo India Youth Games | ఇన్​ఛార్జీలుగా మంత్రులు

హైదరాబాద్​తో పాటు వివిధ జిల్లాల్లో కూడా పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటి పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించారు. హైదరాబాద్​కు పొన్నం ప్రభాకర్​ను, రంగారెడ్డికి శ్రీధర్ బాబు, మహబూబ్‌నగర్​కు జూపల్లి కృష్ణారావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కరీంనగర్‌కు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మంకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని బాధ్యులుగా నియమించారు. తెలంగాణ సంప్రదాయ యుద్ధ కళ కర్రసాము ఈ పోటీల్లో ప్రదర్శన క్రీడగా తొలిసారి నిర్వహిస్తున్నారు. కర్రసాముకు సంబంధించి రూపొందించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

దీనిని కూడా చదవండి : Voter Rights Protection | అర్హులు ఓటు హక్కు కోల్పోవద్దు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *