TGEJAC Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ముందుకురావడం హర్షణీయం: టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TGEJAC Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) సానుకూలంగా స్పందించడం హర్షణీయమని టీజీఈజేఏసీ (tgejac) జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్​లో (TNGOs Bhavan) సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

TGEJAC Nizamabad | ఒక రోజు నిరాహార దీక్షను విరమిస్తున్నాం..

టీజీఈజేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాస్ ఆదేశానుసారం 5వ తేదీన నిర్వహించాలనుకున్న ఒకరోజు నిరాహార దీక్షను విరమించుకుంటున్నట్లు నాశెట్టి సుమన్​కుమార్​ తెలిపారు. భవిష్యత్​లో రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నేతికుంట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *