Kamareddy Fire Accident | చిరు వ్యాపారులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కేవీఆర్​

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Accident | అగ్ని ప్రమాదం (Fire Accident)లో దుకాణాలను కోల్పోయిన బాధిత చిరు వ్యాపారులకు అండగా ఉంటానని కామారెడ్డి ఎమ్మెల్యే (Kamareddy MLA) కాటిపల్లి వెంకట రమణారెడ్డి భరోసా కల్పించారు. ఆయన పాత బస్టాండ్ ఇందిరా చౌక్ వద్ద అగ్నిప్రమాదంలో కాలిపోయిన దుకాణాలను కౌన్సిలర్లతో కలిసి సోమవారం పరిశీలించారు.

Kamareddy Fire Accident | అధైర్యపడొద్దు..

ప్రమాదం జరిగిన తీరుపై వ్యాపారస్తులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణాలు కాలిపోవడం దురదృష్టకరమని, వ్యాపారస్థులు వ్యాపార సామాగ్రితో పాటు దుకాణం నిర్మాణం మొత్తం నష్టపోయారన్నారు.

22 దుకాణదారుల వివరాలు పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని, వారికి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం తరపున పునర్నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఆలోపు కాలిపోయిన వస్తువులన్నింటినీ తీసేసి స్థలం చదును చేయాలని సూచించారు. కాలిపోవడం ద్వారా నష్టపోయిన మొత్తంలో ప్రభుత్వం తరుపున రావాల్సిన పరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement | ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లే దారిని తవ్వేశారు.. ఆందోళనలో రైతులు..

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *