క్రైంNizamabad Rural Police | భార్యాభర్తల గలీజు దందా.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

Nizamabad Rural Police | భార్యాభర్తల గలీజు దందా.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

ఒంటిరిగా బైక్​పై వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని బ్లాక్​ మెయిల్ చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Rural Police | సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న భార్యాభర్తలు గలీజు దందాకు తెరలేపారు. లిఫ్ట్​ అడిగి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి డబ్బుల వసూళ్లకు తెరలేపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని భార్యాభర్తలను కటకటాల వెనక్కి పంపారు. ఈ మేరకు ​రూరల్​ పోలీసులు వివరాలు వెల్లడించారు.

Nizamabad Rural Police | నాందేడ్​కు చెందిన భార్యాభర్తలు..

రూరల్​ పోలీసులు (Rural Police) తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని(Maharashtra) నాందేడ్(nanded) జిల్లా మథ్కేడ్​ తాలూకా ముక్రంబాద్​ గ్రామానికి చెందిన మంగేష్కర్​ గైక్వాడ్​, ఉజ్వల గైక్వాడ్ భార్యాభర్తలు. వీరు నగర శివారులోని(Nizamabad City) మాధవ్​నగర్​లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న వీరు గలీజ్​ దందాకు తెరలేపారు.

ఉజ్వల గైక్వాడ్​ రెండు నెలలుగా కంఠేశ్వర్ బైపాస్(Kanteshwar Bypass), ఆర్మూర్​ రోడ్డులో  నిలబడి ఒంటరిగా బైక్​పై వెళ్తున్న వారికి సైగలు చేస్తూ దగ్గరికి పిలుస్తుంది. అనంతరం రేటు మాట్లాడుకొని బైక్​పై అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తుంది. అయితే ఆమె భర్త వారిని ఫాలో అవుతూ వెనుక వెళ్తాడు. అక్కడకు వెళ్లాక బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇద్దరూ ఇలా పలు ప్రాంతాల్లో బైక్​పై వెళ్లేవారిని శృంగారం పేరుతో తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడని కేసు పెడ్తామని బెదిరించి డబ్బులు దండుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిఘావేసి ఈనెల 9న భార్యాభర్తలను నగరంలోని గూపన్​పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం చేసినట్లు వారు ఒప్పుకున్నారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay Comments | నా మీద కుట్ర పన్నారు.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Reduce Cooking Oil | వంట నూనె వినియోగాన్ని తగ్గించండి.. దేశ సేవ చేయండి: ప్రధాని మోడీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Reduce Cooking Oil | ప్రధాని నరేంద్ర మోడీ...

Modi on Gold Purchase | ఏడాది పాటు బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi on Gold Purchase | ఏడాది...

Travels Bus Accident | ట్రావెల్స్​ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Travels Bus Accident | ట్రావెల్స్​ బస్సు...

Srinagar Theft Cases | శ్రీనగర్‌లో దొంగల బీభత్సం.. పలు ఇళ్లల్లో చోరీలు..

అక్షరటుడే, బాన్సువాడ: Srinagar Theft Cases | దొంగలు బీభత్సం సృష్టించారు....