అక్షరటుడే, వెబ్డెస్క్ : TRS Flag Festival | తెలంగాణ (Telangana) రక్షణ సేన భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు నెల రోజుల పాటు వాడవాడనా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు.
కవిత ఇటీవల టీఆర్ఎస్ పార్టీ (TRS Party)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ బలోపేతంపై ఆమె దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మే 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు.
TRS Flag Festival | ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు
తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నాయకులు, కార్యకర్తలను కవిత కోరారు. అలాగే పార్టీ ఆవిర్భావ సభలో తెలిపిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపైన పోరాడాలన్నారు. జెండా పండుగలో భాగంగా కార్యకర్తలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాలని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Bandi Bhagirath POCSO Case | బండి భగీరథ్ కేసులో విచారణ ప్రారంభం : సీఎం రేవంత్రెడ్డి

